Friday, September 20, 2024

కోహ్లి చిన్నప్పటి స్నేహితుడిలా ఉంటాడు : షమి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఎంతో మంది మిత్రులు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో కెఎల్. రాహు ల్, జడేజా, రహానె వంటి మిత్రులు కోహ్లికి ఉన్నారు. ఇలాంటి కోవలోకే భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి కూడా వస్తాడు. వీరిద్దరి స్నేహం ఎంతో ప్రత్యేకమైందని చెప్పాలి. ఇదిలావుండగా ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో విరాట్ కోహ్లిపై షమి ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి లాంటి స్నేహితులు చాలా అరుదుగా దొరుకుతారన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరితో కోహ్లి ఎంతో సరదాగా ఉంటాడన్నాడు. ప్రతి ఒక్కరిపై ఎంతో అప్యాయత కనబరుస్తాడన్నాడు. కోహ్లి తీరును చూస్తే చిన్నప్పటి స్నేహితులు గుర్తుకు వస్తారన్నాడు.

విరాట్ మా ఫాస్ట్ బౌలిం గ్ దళానికి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచాడన్నాడు. మాకెంతో స్వేచ్ఛనిచ్చాడు. మా ప్రణాళికలు విఫలమైనప్పుడూ మాత్రమే అతను కోపాన్ని ప్రదర్శిస్తాడు. లేకపోతే మేం ఏం చేసినా పట్టించుకోడు. ఇక ఏ బౌలరైనా బంతులేసే ముందు కెప్టెన్‌తో మాట్లాడేందుకు సందేహిస్తారు. అయితే విరాట్ విషయంలో ఎప్పుడూ అలా జరగలేదు. మాతో కలిసి జోకులు వేస్తాడు. ఎప్పుడూ సరదాగా ఉంటూ ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహ్నాని నింపుతాడు. అతనిలాంటి కెప్టెన్ లభించడం టీమిండియా అదృష్టమని షమి ప్రశంసించాడు. ఇక టీమిండియాలోని ప్రతి క్రికెటర్‌తో కోహ్లికి మంచి సంబంధాలు ఉన్నాయని, అందుకే జట్టు వరుస విజయాలు సాధిస్తుందని షమి పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News