డిస్పూర్ : ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అస్సాం 15వ సిఎంగా బిజెపి నేత హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జగదీశ్ ముఖీ హిమంతతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, త్రిపుర సిఎం బిప్లబ్ దేబ్, మేఘాలయ సిఎం కోన్రాడ్ సంగ్మా, మణిపూర్ సిఎం ఎన్ బీరెన్ సింగ్, నాగాలాండ్ సిఎం నీఫ్యూ రియో తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు డౌల్ గోవింద ఆలయం, కామాఖ్యా దేవి దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 126 స్థానాలు అస్సాం శాసనసభకు మూడు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బిజెపి కూటమి విజయం సాధించింది. ఆదివారం జరిగిన బిజెపి భేటీలో శాసనసభా పక్ష నేత హిమంతను ఎన్నుకున్నారు. దీంతో సర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Himanta Biswa Sarma sworn in as Chief Minister of Assam