- Advertisement -
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో(యుటి) ఇప్పటికీ ఒక కోటి డోసులకు పైగా కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని, మరో మూడు రోజుల్లో వాటికి అదనంగా 9 లక్షలకు పైగా డోసులు సరఫరా అవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రాలు, యుటిలకు దాదాపు 18 కోట్ల వ్యాక్సిన్ డోసులు(17,93,57,860) ఉచితంగా అందచేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. వీటిలో వృథా అయిపోయిన వ్యాక్సిన్‌తో కలుపుకుని వినియోంచింది 16,86,27,797 డోసులని వివరించింది. ఇప్పటికీ రాష్ట్రాలు, యుటిలలో ఒక కోటికి పైగా1,04,30,063) వ్యాక్సిన్ డోసులు వినియోగించడానికి ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో 9,24,910 వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, యుటిలకు సరఫరా కానున్నాయని తెలిపింది.
- Advertisement -