అంతా అదుపులో ఉన్నట్టు నటన
బ్యాంకాక్ : మయన్మార్‌లో అధికారాన్ని మిలిటరీ చేజిక్కించుకుని వంద రోజులౌతున్నా అంతా నటనే తప్ప దేనినీ అదుపు చేయలేక పోతోంది. మొట్టమొదట వ్యవస్థాపరంగా తిరుగుబాటు చేసిన రైల్వే కార్మికులు ఫిబ్రవరి నుంచి సమ్మెలో కొనసాగుతున్నారు. ఆరోగ్య కార్యకర్తలు శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వ వైద్యసేవలను నిలిపివేశారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు పని మానుకున్నారు. విశ్వవిద్యాలయాలు తిరుగుబాటుకు వేదిక లయ్యాయి.ఇటీవల కొన్ని వారాలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతులను బహిష్కరించడంతో ప్రాథమిక విద్య దెబ్బతింది. ఈ విధంగా మిలిటరీ ప్రభుత్వం పాలన ప్రారంభించిన వంద రోజులూ ఆందోళనలు, తిరుగుబాటుల తోనే సాగుతోంది తప్ప ఏదీ పరిష్కారం కావడం లేదు. కానీ అంతా అదుపులో ఉన్నట్టు పాలన సజావుగా సాగుతున్నట్టు మిలిటరీ పాలకులు నటిస్తున్నారు.