- Advertisement -
బెంగళూరు: కరోనా భయంతో ఓ నటి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటకలోని బయ్యప్పనహళ్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బయ్యప్పనహళ్లిలో పోలీస్ స్టేషన్లో పని చేసే కానిస్టేబుల్, తన భార్య జ్యోతితో కలిసి కెఆర్ పురంలో నివసిస్తున్నాడు. జ్యోతి పలు టివి కార్యక్రమాల్లో ఆమె పాటలు పాడుతోంది. కోలారు వెళ్లిన జ్యోతి అక్కడే ఆత్మహత్య చేసుకుంది. మృతదేహానికి వైద్యులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. కరోనా భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -