Monday, November 18, 2024

బ్యాంకు పని వేళల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

Banks to work for 4 hrs from today during lockdown

 

ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు

మన తెలంగాణ/హైదరాబాద్: బ్యాంకు ఖాతాదారులకి నిజంగా శుభవార్తే. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్రంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్‌లో 50 శాతం సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. అంతకు ముందు లాక్‌డౌన్ అమలు రోజుల్లో పనివేళలు, పనిగంటలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే పనివేళలు చేయాలని సూచించారు. ఉద్యోగులు అందరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తీర్మానించాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్న సందర్భంగా బ్యాంక్ పనివేళలు, పరిమిత సంఖ్యలో ఉద్యోగుల హాజరు, వ్యాక్సినేషన్ అంశాలపైఐ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసరంగా సమావేశమై చర్చించింది.

జూమ్ యాప్ ద్వారా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) చైర్మన్ ఒపి మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో వివిధ బ్యాంకులకు చెందిన కమిటీ సభ్యులు అభిప్రాయాలు వెల్లడించారు. లాక్‌డౌన్ విధింపు సమయంలో బ్యాంకుల కార్యకలాపాలపై ప్రధానంగా చర్చించారు. బ్యాంకు పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేలా చూడాలని ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ కృష్ణశర్మ సూచించారు. నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సైతం పనివేళలు మధ్యాహ్నం 12 గంటల వరకే ఉండేలా విజ్ఞప్తి చేశాయి. మొదటివ రెండు గంటలు ఖాతాదారులకు సేవలు.. ఆ తర్వాత రెండు గంటలు అంతర్గత పనులు చేసుకోవడానికి సరిపోతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని సభ్యులు సూచించారు. 50 శాతం ఉద్యోగులతో పనిచేసే విషయాన్ని ఆయా బ్యాంకులకు వదిలేసిన ఎస్‌ఎల్‌బిఇ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనుంది.

Banks to work for 4 hrs from today during lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News