కొత్తగా మరో 4723 మందికి వైరస్ జిహెచ్ఎంసిలో 745, జిల్లాల్లో 3978 మందికి పాజిటివ్ వైరస్ దాడిలో 31 మంది మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 87 శాతానికి పెరిగింది. ఇది దేశ సగటు 83 శాతం కంటే అదనంగా తేలడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు, ఆసుపత్రుల్లో అందిస్తున్న మెరుగైన వైద్యంతోనే ఇది సాధ్యమవుతున్నట్లు ఆరోగ్యశాఖ చెబుతుంది. ఇదిలాఉండగా కొత్తగా మరో 4723 మందికి వైరస్ సోకింది.వీరిలో జి హెచ్ఎంసి పరిధిలో 756 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 44, భద్రాద్రి 105, జగిత్యాల 134, జనగామ 68, భూపాలపల్లి 92, గద్వాల 79, కా మారెడ్డి 49, 219, 205, ఆసిఫాబాద్ 58, మహ బూబ్‌నగర్ 156, మహబూబాబాద్ 98,
మంచిర్యాల 161, మెదక్ 55, మేడ్చల్ మల్కాజ్గిరి 305, ములుగు 57, నాగర్‌కర్నూల్ 194, నల్గొండ 181,నారాయణపేట్ 42, నిర్మల్ 27, నిజామాబాద్ 96, పెద్దపల్లి 148, సిరిసిల్లా 59, రంగారెడ్డి 312, సంగారెడ్డి 114, సిద్ధిపేట్ 161, సూర్యా పేట్ 105, వికారాబాద్ 153, 85, వరంగల్ రూరల్ 105, వ రంగల్ అర్బన్ మరో 117మంది ఉన్నట్లు అధికారు లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,11,711కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 4,49,744 కి చేరింది. అదే విధంగా వైరస్ దా డిలో బుధవారం మరో 31మంది మరణించగా, మొత్తం కరోనా మర ణాల సంఖ్య2834కి చేరుకుంది.