Saturday, November 23, 2024

పెట్రోల్ పంపు లు లాక్ డౌన్ నిబంధనల ప్రకారమే నడపాలి

- Advertisement -
- Advertisement -

పౌరసరఫరాలశాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్:  మాచన రఘునందన్

పెట్రోల్ బంక్ లు లాక్ డౌన్ నిబంధనల ప్రకారం మాత్రమే వ్యాపారం నిర్వహించాలని పౌరసరఫరాలశాఖ నారాయణ పేట జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు.  బుధవారం ఆయన జిల్లా లోని మరికల్ పట్టణం లో ఉన్న పెట్రోల్ బంక్ ను తనిఖీ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న పెట్రోల్ బంక్ లు లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు మాత్రమే పని చేయాలని నిర్దేశించారు. వినియోగదారులు లాక్ డౌన్ నిబంధనల ను దృష్టి లో పెట్టుకొని నిర్ణీత సమయం లోనే ఇంధనం కోసం ప్రయత్నించాలన్నారు.విధిగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవని రఘునందన్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News