Saturday, November 23, 2024

చహల్ తల్లిదండ్రులకు కరోనా…

- Advertisement -
- Advertisement -

Yuzvendra chahal parents corona positive

ఢిల్లీ: భారత క్రికెటర్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకింది. చహల్ తల్లికి స్వల్ప లక్షణాలు ఉండడంతో హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటుంది. చహల్ తండ్రి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. మా మామా, అత్తమ్మకు కరోనా పాజిటివ్ వచ్చిందని చహల్ భార్య ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. మామకు లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశామన్నారు. అత్తమామలు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అందరూ ఇంట్లోనే ఉండండి.. మాస్క్ ధరించి క్షేమంగా ఉండాలని సూచించింది. పియుష్ చావ్లా, ఆర్‌పి సింగ్ ల తల్లిదండ్రులను కరోనా వైరస్ బలి తీసుకుంది. ఐపిఎల్ రద్దు కావడంతో ఇంట్లోనే ఉండి చాహల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఫైనల్ కు చాహల్ ఎంపిక కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News