ముంబై: చమురు సంస్థలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. దేశంలో ఒక రోజు విరామం తర్వాత ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 22 నంచి 37 పైసలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 29, డీజిల్ పై 34 పైసలు పెంచాయి. దీంతో ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.34, డీజిల్ రూ.82.95గా నమోదైంది. ముంబైలో డీజిల్ ధర రూ. 90 దాటింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 98.82, డీజిల్ రూ.90.19కు పెరిగింది. గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్ పై రూ.1.94, డీజిల్ పై రూ.2.22 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు చోట్ల లీటర్ పెట్రోల్ రూ.100మార్క్‌ను దాటాయి. రోజు రోజుకూ చమురు ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మళ్లీ పెరిగిన చమురు ధరలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -