లక్నో: ఖైదీల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు గ్యాంగ్‌స్టర్స్ మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అన్షుల్ దీక్షిత్ అనే ఖైదీ మరో గ్యాంగ్‌స్టర్ ముఖీమ్ కాలాపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఘటనా స్థలంలో ముఖీమ్ చనిపోయాడు. బుల్లెట్లు మరో ఖైదీ మిరాజుద్దీన్‌కు తాకాడంతో తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు. మీరాజుద్దీన్ మాఫియా డాన్, బహుజన్ సమాజ్ పార్టీ ఎంఎల్‌ఎ ముక్తార్ అన్సారీగా అనుచరుడిగా గుర్తించారు. దీక్షిత్ లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించిన వారిపై కాల్పులు జరిపాడు. పోలీసులు కాల్పుల్లో దీక్షిత్ చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని చిత్రకూట్ ఎస్‌పి అంకిత్ మిట్టల్ తెలిపాడు. జైలులోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తామని ఎస్‌పి వెల్లడించారు. 2018లో గ్యాంగ్‌స్టర్ మున్నా భజరంగీని మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రదీ భగ్‌పాట్ జైలులో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
జైళ్లో గ్యాంగ్ వార్… ముగ్గురు ఖైదీలు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -