Sunday, November 17, 2024

మా 11 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నాం

- Advertisement -
- Advertisement -

మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు
విరుష్క దంపతుల సంతోషం

ముంబయి : కరోనా బాధితులకు సహాయం అందించేందుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ ప్రాంభించిన ‘ఇన్ దిస్ టుగెదర్’ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది.ఈ మేరకు తాము నిర్ణయించుకున్న రూ.11 కోట్ల లక్షాన్ని చేరుకున్నట్లు విరుష్క దంపతు లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.దేశంలో ఇటీవల కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కోహ్లీ, అనుష్క దంపతులు ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరిట కొవిడ్ రిలీఫ్ కోసం విరాళాల సేకరణ ప్రారంభించారు. తమ వంతుగా రూ.2 కోట్ల విరాళం అందించి విరుష్క దంపతులు కార్యక్రమాన్ని ప్రాంభించారు. తొలుత రూ.7 కోట్ల విరాళాలు సేకరించాలని లక్షంగా పెట్టుకున్నారు. అయితే ఎంపిఎల్ అనే క్రీడా సంస్థ వారికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ లక్షాన్ని రూ.11 కోట్లకు పెంచుకున్నారు. శుక్రవారం తమ లక్షాన్ని అధిగమించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.‘ మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగానే ఆశ్చర్యపోయా. మేం తొలుత నిర్దేశించుకున్న లక్షానికన్నా ఎక్కువ మొత్తం సేకరించడం గర్వంగా ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఇదిలాగే కొనసాగుతుంది. దేశ ప్రజలకు సమాయం చేయడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు. మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. జైహింద్’అని అనుష్క తన సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రూ. 11,39,11,820లు జమ అయినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News