Saturday, November 23, 2024

పెళ్లి కావడంలేదని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young women commit suicide in Hyd

హైదరాబాద్: పెళ్లి సంబంధాలు కుదరడంలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కృష్ణానగర్‌కు చెందిన టీ కావ్య(22) తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఆమె ఇంకా ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. గత సంవత్సరం నుంచి ఆమె సంబంధాలు చూస్తున్నారు. ఏ ఒక్కటి నిశ్చయం కాకపోవడంతో మానసిక వేదనకు గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అపస్మారక స్థితికి చేరుకున్న కావ్యను కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News