- Advertisement -
హైదరాబాద్: బ్లాక్ ఫంగస్‌కి చికిత్స అందించడానికి నోడల్ సెంటర్ ఏర్పాటు చేశామని సిఎం కెసిఆర్ తెలిపారు. నోడల్ సెంటర్‌గా కోఠి ఇఎన్‌టి ఆస్పత్రిని కేటాయించామని, కంటి సమస్యలు ఉంటే సరోజిని దేవి కంటి ఆస్పత్రి వైద్యుల సహాయం తీసుకోవాలని కెసిఆర్ సూచించారు. బ్లాక్ ఫంగస్‌కి సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు అందజేయాలని టిఎస్‌ఎంఐడిఐకి సిఎం కెసిఆర్ ఆదేశించారు.
కరోనా రోగులకు ఆక్సిజన్ అందించే క్రమంలో తేమ అందించే పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉండే రోగులు ఆ పరికరంలో స్టెరైల్ వాటర్ వాడకుండా మామూలు నల్ల నీళ్లను వాడుతుండడంతో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ చికిత్సలో భాగంగా రోగులకు స్టిరాయిడ్స్ ఇస్తున్నారు. దీంతో కళ్లు, ముక్కు, మెదడు, పళ్లపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు తెలిపారు.
- Advertisement -