హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, అంబర్ పేట, ఉప్పల్, ఎల్బినగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్ తోపాటు సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక, రాజేంద్ర నగర్, అత్తాపూర్, బండ్లగూడ, గండిపేట్, శంషాబాద్, గగన్‌పహాడ్, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, బార్కస్ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలతోపాటు రహదారులపై వరద నీరు నిలిచింది. మరో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం పడింది. ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షాలతో పలు జిల్లాలో వరి కుప్పలు తడిసిపోయాయి.మరికొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు అవేధన వ్యక్తం చేస్తున్నారు.
Tauktae Cyclone: Rain in Several Areas in Telangana