- Advertisement -
ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఎంపి రఘురామ కేసు విచారణ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేసులో ఇంప్లీడ్ కావాలని సుప్రీం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్‌కు పిటిషన్ కాపీని మెయిల్ చేయాలని ఆదేశించింది. రఘురామ తరఫున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తుండగా, ఎపి సిఐడి తరఫున దుశ్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. కస్టడీలో ఎంపి రఘురామను పోలీసులు కొట్టారని ముకుల్ రోహిత్గి తెలిపారు. బెయిల్‌తో పాటు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు అనుమతివ్వాలన్నారు. ఇప్పటి వరకు ప్రైవేటు ఆస్పత్రిలో రఘురామను పరీక్షించలేదన్నారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు.
- Advertisement -