Friday, November 8, 2024

ఇంటికి చేరిన కంగారూలు..

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఐపిఎల్ ముగిసిన తర్వాత చాలా రోజుల పాటు మాల్దీవ్స్‌లో ఉండిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. భారత్‌లో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో ఐపిఎల్‌ను అర్ధాంతరంగా నిలిపి వేశారు. ఇక కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో ఐపిఎల్ ముగిసినా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశాని కి వెళ్లలేక పోయారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో క్వారంటైన్‌లో ఉండి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అనివార్యం కంగారూలకు ఏర్పడింది.

కాగా, ఆస్ట్రేలియా క్రికెటర్లను మాల్దీవ్స్‌కు పంపించిన భారత క్రికెట్ బోర్డు అక్కడ వారిని క్వారంటైన్ లో ఉంచింది. క్వారంటైన్ పూర్తి కావడంతో ప్రత్యేక విమానాల ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్ల ను, సహాయక సిబ్బందిని అక్కడికి పంపించిం ది. ఈ ఐపిఎల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 38 క్రికెటర్లు పాలుపంచుకున్నారు. వీరిలో స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, మాక్స్‌వెల్, కమిన్స్ ఉన్నారు. అంతేగాక మైక్ హసి, స్లేటర్, టామ్ మూడీ తదితర మాజీ క్రికెటర్లు ఆయా జట్లకు కోచ్‌లుగా వ్యవహరించారు. వీరందరూ ప్రస్తు తం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు.

Australian Cricketers returns home after IPL Suspension

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News