Saturday, November 23, 2024

గిరిజనులపై పోలీసుల కాల్పులు…. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Police firing on tribes in chhattisgarh

 

బీజాపూర్: పోలీసుల కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగింది. ఈ కాల్పుల్లో 15 మంది అమాయక గిరిజనులు గాయపడినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిలిగర్ వద్ద పోలీసులు క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళన చేయడంతో పోలీసులు కాల్పులకు దిగినట్టు సమాచారం. తమ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జరపడంతోనే ఎదురు కాల్పులు జరిపామని బస్తర్ ఐజి సుందర్ రాజ్ వెల్లడించారు. తమపై అన్యాయంగా పోలీసులు కాల్పులు జరిపి తొమ్మిది మందిని పొట్టనపెట్టుకున్నారని గిరిజనులు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News