Monday, November 18, 2024

కరోనా సోకిందనే భయంతో యువకుడు కిరోసిన్ తాగి….

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: కరోనా వైరస్ కంటే దీంతో వచ్చిన భయమే ఎక్కువ మంది ప్రాణాలు తీస్తోంది. వంద మంది కరోనా వస్తే ఒక్కరు మాత్రమే ప్రాణాలు వీడుస్తున్నారు. అది కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు కరోనా సోకిందనే భయంతోనే ప్రాణాలు వీడుస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో మహేంద్ర అనే యువకుడికి విపరీతమైన జ్వరం రావడంతో కరోనా సోకిందనే అనుమానంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. కిరోసిన్ తాగితే కరోనా పోతుందని ఓ స్నేహితుడు సలహా ఇవ్వడంతో ఆలోచించకుండా కిరోసిన్ తాగాడు. దీంతో ఆ యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతదేహానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. కరోనా విషయంలో వైద్యులు, ప్రభుత్వాలు చెప్పిన మెడిసిన్ వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News