స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ మూవీ ‘పుష్ప’ చిత్రీకరణకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఇంకా నెలరోజుల చిత్రీకరణ పెండి ంగ్లో ఉంది. మొదటి భాగం చిత్రీకరణ పూర్తి కాగానే సీక్వెల్ చిత్రీకరణ కూడా ప్రారంభమవుతుంది. సీక్వెల్కి పుష్ప కాకుండా వేరే టైటిల్ని పరిశీలిస్తున్నారని సమాచారం. మొదటి భాగానికి ‘పుష్ప’ అని పేరు పెట్టారు. అది హీరో పుష్పరాజ్ పేరు. ఇక రెండవ భాగం టైటిల్ అతి త్వరలో ఖరారవుతుంది. దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది. షూటింగ్ పునఃప్రారంభమైన తర్వాత మొదటి భాగం షూటింగ్ ఒక నెలలోపు పూర్తవుతుంది. పుష్ప- 1 ఈ ఏడాది చివరి నాటికి రిలీజవుతుంది. సీక్వెల్ విషయానికొస్తే.. ఈ సంవత్సరం చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది భారీ స్థాయిలో ఉంటుంది. పుష్ప రెండు భాగాల కోసం మైత్రి మూవీ మేకర్స్ 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ను కేటాయించింది.