తిరువనంతపురం :కేరళలో వీణాజార్జి తదుపరి ఆరోగ్య మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆరోగ్య మంత్రి కెకె శైలజ స్థానంలో వీణా జార్జి ఈ బాధ్యతలు బాధ్యతలలోకి వస్తారని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందనిభావిస్తున్నారు. వీణా జార్జి గతంలో జర్నలిస్టుగా ఉన్నారు. తరువాత రాజకీయాలలోకి వచ్చారు. కేరళలో కొవిడ్ పరిస్థితిని అదుపులో పెట్టడంలో శైలజ అత్యంత సమర్థవంతంగా వ్యవహరించారని ప్రపంచవ్యాప్త ప్రశంసలు వెలువడ్డాయి. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్ 21 మంది సభ్యుల కేబినెట్లో స్థానం లేకుండా పోయిన ఐదుగురు సిపిఎంకు చెందిన మంత్రులలో శైలజ కూడా ఉండటం వివాదాస్పదం అయింది. పార్టీ వర్గాలు ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పటికే శైలజను పార్టీ చీఫ్ విప్‌గా తీసుకున్నారు.
ఇక44 ఏండ్ల వీణా విజయన్ కేబినెట్లో అతి చిన్న వయస్కురాలు. గురువారం ఆమె ప్రమాణస్వీకారం చేస్తారని భావిస్తున్నారు. వీణా పథనంథిట్ట జిల్లాలోని అరన్ములా నియోజకవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత టీవీ జర్నలిస్టుగా యాంకర్‌గా ఉన్న వీణా తరువాత ప్రఖ్యాత మలయాళ మనోరమ న్యూస్‌లో యాంకర్‌గా జర్నలిస్టుగా పనిచేశారు. తరువాత టీవీ న్యూకు ఎక్సిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. తరువాత 2016లో రాజకీయాలలో చేరారు. కేరళలో అరన్ముల్లా నియోజకవర్గం నుంచి గెలిచారు.