Monday, November 25, 2024

ఎపిలో 20,937 కరోనా కేసులు : 104 మృంది మృతి

- Advertisement -
- Advertisement -

20937 New Covid-19 Cases Reported in AP

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 92,231 నమూనాలను పరీక్షించగా.. 20,937 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరింది. తాజాగా 104 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 9,904కి పెరిగింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈక్రమంలో 20,811 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జి అయ్యారని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 క్రియాశీల కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. మహమ్మారి కారణంగా చిత్తూరులో అత్యధికంగా 15 మంది మృతి చెందగా ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10 మంది, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

విశాఖ జైల్లో 57 మంది ఖైదీలకు కోవిడ్ : 
విశాఖపట్నం సెంట్రల్ జైలులో 57 మంది ఖైదీలకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. గత వారంలో కొంతమంది ఖైదీలకు కోవిడ్-19 లక్షణాలు కనిపించాయని, దీని తరువాత జైలు అధికారులు ప్రత్యేక కోవిడ్-19 టెస్ట్ డ్రైవ్‌ను ఏర్పాటు చేశారని ఎస్‌పి రాహుల్ తెలిపారు. కరోనా పరీక్షలు చేసిన 102 మంది ఖైదీలలో 57 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించారని ఆయన చెప్పారు. వారిని పర్యవేక్షిస్తున్న ఇద్దరు వైద్యులతో చికిత్స పొందుతున్నారని రాహుల్ పేర్కొన్నారు

20937 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News