- Advertisement -
గోమా: తూర్పు కాంగో ఇరగోంగోలోని అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. గోమా నగరానికి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం దాదాపు రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విస్ఫోటనం చెందిందని అధికారులు వెల్లడించారు. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి ప్రవహిస్తోంది. అగ్నిపర్వతం విస్ఫోటనంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పారు. పర్వతం పేలడంతో భయందోళనకు గురైన ప్రజలు గోమా నగరాన్ని ఖాళీ చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు వేలకుపైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. 2002లో నైరాగోంగో విస్ఫోటనంలో 250 మంది మృతిచెందగా, 120,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన అగ్నిపర్వతాలలో ఒకటిగా పరిగణించవచ్చని అధికారులు చెబుతున్నారు.
- Advertisement -