Saturday, November 23, 2024

ఢిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Lockdown extension for another week in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసుల్లో తగ్గుదల నమోదవుతుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. గత 24 గంటల్లో 1600 కరోనా పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయని చెప్పారు. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 2.5 శాతానికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 31 తర్వాత ఢిల్లీలో దశలవారీగా అన్ లాక్ ప్రక్రియ ఉంటుందని కేజ్రీవాల్ తెలిపారు. కోవిడ్-19 పోరు ఇంకా అయిపోలేదని కేజ్రీవాల్ తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పిన కేజ్రీవాల్ త్వరలోనే 2 కోట్ల మందికి టీకాల కోసం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దాని కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సిఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Lockdown extension for another week in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News