- Advertisement -
హైదరాబాద్: కేంద్రం ఆంక్షల వల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ముందస్తుగా డబ్బులు చెల్లించామని, గ్లోబల్ టెండర్లు పిలిచినా కేంద్రం ఆంక్షలతో వ్యాక్సిన్ తెచ్చుకోలేకపోతున్నామన్నారు. విదేశీ కరోనా టీకాలకు మోడీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
- Advertisement -