అమరావతి: విశాఖపట్నం హెచ్పిసిఎల్ లో మంటలు అదుపులోకి వచ్చాయి. 20 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అరగంటలో అదుపులోకి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. హెచ్పిసిఎల్ ప్రమాదం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని విశాఖ కలెక్టర్ వెల్లడించారు. హెచ్పిసిఎల్ సిడియు 3వ యూనిటిల్ లో మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ మొత్తానికి మంటలు అంటుకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మూడుసార్లు సైరన్ మోగించి ఉద్యోగులను అధికారులు బయటకు పంపారని ఆయన పేర్కొన్నారు. అలారం మోగడంతో అందరం బయటికొచ్చేశఆమని కార్మికులు తెలిపారు. సహాయచర్యల్లో నావికా, హెచ్ పిసిఎల్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ సెన్సార్లు పనిచేశాయని సిబ్బంది తెలిపారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Fire breaks out at HPCL plant in Visakhapatnam