హీరోయిన్లు మేకప్ వేసుకుంటే ఏంజిల్స్‌గా మారిపోతారు. మేకప్ లేకుండా క్యాజువల్‌గా కనిపించి ఆకట్టుకునే అందగత్తెలు కూడా ఉన్నారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువ. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత చాలామందికి గ్లామర్ తగ్గిపోతుంది. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అదే గ్లామర్‌తో అభిమానులను మురిపిస్తోంది. ఆమె ఇప్పటికీ అదే స్లిమ్‌ను మెయింటేన్ చేస్తోంది. ఈ లాక్డౌన్లో తన అపార్ట్ మెంట్ టెర్రస్‌పై నిల్చొని ఒక ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి. మేకప్ లేకుండా సాధారణ లుక్‌లో కూడా స్టన్నింగ్‌గా ఉన్నావు… అని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు పక్కా హౌజ్ వైఫ్‌లా ఉన్నావని అంటున్నారు. మొత్తానికి కాజల్ పెళ్లి తర్వాత ఇలా మారిపోయింది. 35 ఏళ్ల కాజల్ గత ఏడాది తన లాంగ్ టైం బాయ్‌ఫ్రెండ్ గౌతమ్‌ని పెళ్లి చేసుకొంది. ప్రస్తుతం ఆమె చేతిలో చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జున,- ప్రవీణ్ సత్తారు సినిమా ఉంది. ఒకవేళ కమల్ హాసన్,- శంకర్ల ‘ఇండియన్ 2’ మళ్లీ మొదలైతే అది కూడా ఆమె పూర్తి చేయాలి.