Sunday, September 22, 2024

సాగు సన్నద్ధత

- Advertisement -
- Advertisement -

Minister Niranjan Reddy review on monsoon Cultivation

కోటి 40లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు

13.06లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
అందుబాటులో 18లక్షల క్వింటాళ్లు
కందిసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎకరాకు 2కిలోల విత్తనాలు ఉచితం
సమీక్ష సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న వానాకాలపు పంటగా రాష్ట్రంలో కోటి40లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగులోకి రానున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం హాకా భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి వానాకాలపు పంటల సాగు, విత్తన అవసరాలు తదితర అంశాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ సారి పంటల సాగుకు మంచి వర్షాలతోపాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి విత్తనోత్పల రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటల సాగుకు కలిపి 13.06లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అని అంచనా వేశారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు మించి అందుబాటులో 18.28లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ సారి సాగులోకి రానున్న ప్రధాన పంటల్లో 70.05లక్షల ఎకరాల్లో పత్తి, 20లక్షల ఎకరాల్లో కంది, 41లక్షల ఎకరాల్లో వరి పైర్లు సాగులోకి వస్తాయని అంచానా వేసినట్టు తెలిపారు.

వరిసాగుకు ప్రత్యామ్నాయంగా రైతులు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న కంది, పత్తి సాగును మరింత పెంచాలన్నారు. తెలంగాణ పత్తి ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందన్నారు. పత్తిపంట సాగుకోసం 1.40లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉండగా, జిల్లాల్లో ఇప్పటికే 59.32లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మిగిలిన విత్తన ప్యాకెట్లను క్లస్టర్ల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. క్షేత్ర స్థాయిలో క్లస్టర్ల వారీగా ఉన్న డిమాండ్‌ను బట్టి ఆయా రకాల విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల మూలంగా నాణ్యమైన సోయాబీన్ విత్తనం అందుబాటులో లేదని, అందువల్ల రాష్ట్రప్రభుత్వం సోయాబీన్ విత్తనాలను సరఫరా చేయటం లేదన్నారు. రైతులు సోయాబీన్ పంటసాగుకు ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు డీలర్ల వద్ద సోయాబీన్ విత్తనాలు కొనుగోలు చేయాలనుకునే రైతులు తగిన జాగ్రత్తలతో నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు. వచ్చే యాసంగి సీజన్‌లో కూడా రైతులు విచ్చలవిడిగా వరి సాగు చేయటం తగదన్నారు.
2కిలోల కంది విత్తనాలు ఉచితం:
రాష్ట్రంలో పప్పు దినుసు పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా అంతర పంటగా కందిసాగుకోసం రైతులకు ఎకరాకు 2కిలోల కంది విత్తనాలు ఉచితంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. పంటల సాగులో రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసిన ప్రతిదానికి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేని వ్యాపారుల వద్ద విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను కొనుగోలు చేయరాదని, అధికారులు కూడా ఈ విషయాలను రైతులకు అర్ధమయ్యేలా వివరించాలని సూచించారు. పత్తి విత్తనాలకు సంబంధించి నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటందని మంత్రి నిరజంన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండి కేశవులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Minister Niranjan Reddy review on monsoon Cultivation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News