- Advertisement -
ముంబై: అండర్19 టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో అప్పటి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను చూస్తే జట్టు సభ్యులందరికి ఒక రకమైన భయం ఉండేదని భారత యువ ఓపెనర్ పృథ్వీషా పేర్కొన్నాడు. 2018 అండర్19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు పృథ్వీషా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ జట్టుకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. ఇక ద్రవిడ్‌తో తమ అనుబంధాన్ని పృథ్వీషా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పంచుకున్నాడు. ద్రవిడ్ సార్ అంటే తమకు ఎంతో గౌరవమన్నాడు. ఆయనతో కలిసి భోజనం చేయాలంటే తమకందరికి ఎంతో భయం వేసేదన్నాడు. ఆయన ఏ రోజు కూడా క్రికెటర్లను కొప్పడక పోయినా ఆటగాళ్లలో భక్తితో కూడిన భయం ఉండేదన్నాడు. ఇక ప్రతి ఆటగాడితో ద్రవిడ్ ప్రత్యేక చర్చించే వారని, అతనిలోని లోపాలు చూపిస్తూ వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నించే వారని షా వివరించాడు.
- Advertisement -