Monday, November 18, 2024

తీరాన్ని తాకనున్న యాస్

- Advertisement -
- Advertisement -

Cyclone Yaas to hit north Odisha

భువనేశ్వర్‌ : ఒడిశాకు ఉత్తర దిశగా తీరం వైపు యాస్ తుపాన్ కదులుతోంది. తుపాన్ తీరం దాటే సమయంలో 150 నుంచి 160 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, బుధవారం మధ్యాహ్నం బాలాసోర్ దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో వాయువ్య దిశలో దామ్రాకు 40 కిలోమీటర్లు, దిఘాకు 90 కిలో మీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉందని భువనేశ్వర్  లోని ఐఎండి సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. తుఫాన్ తీవ్ర రూపం దాల్చితే జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒడిశాలోని తీర ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News