Sunday, November 24, 2024

జూడాలు సమ్మె విరమించాలని కోరుతున్నాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Junior doctors in Telangana to go on strike

హైదరాబాద్: జూడాలు సమ్మె విరమించాలని కోరుతున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవన్నారు. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదన్న మంత్రి కెటిఆర్ సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సూచించారు. గతంలో ఇచ్చిన జీతాల పెంపు హామీ అమలు చేయాలంటూ తెలంగాణ జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ సహా ఇతర ఆస్పత్రుల్లో ఇవాళ అత్యవసర సేవలు మినహా మిగితా విధులకుదూరంగా ఉండి నిరసనలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం…

కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో టీకాల కొరత ఏర్పడిందని మంత్రి ఆరోపించారు. హైదరాబా టీకా హబ్ అయినా గ్లోబల్ టెండర్లు పిలవాల్సివచ్చిందన్నారు. కోటి వ్యాక్సిన్లకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివకే టెండర్లు పిలిచిందని కెటిఆర్ స్పష్టం చేశారు.

Junior doctors in Telangana to go on strike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News