హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం సమయంలో జూడాలు సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని, తక్షణమే విధుల్లో చేరాలని కెసిఆర్ అన్నారు. సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరైనది కాదన్నారు. చీటికిమాటికి ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్ 15శాతం పెంచామన్నారు. మూడేళ్ల వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవలు అందిస్తున్నవారికి సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే వేతనాన్ని అందించాలని అధికారులకు సిఎం సూచించారు. జూనియర్ డాక్టర్లకు, వాళ్ల కుటుంబసభ్యులకు నిమ్స్ లో వైద్య అందిస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా తక్షణం విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు అందరికీ ఎక్స్ గ్రేషియా ఇస్తున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
CM KCR Fires on Junior Doctors Strike