- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రేదేశ్ లో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్ పరీక్షించగా, ఎపిలో 18,285 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇక కరోనాతో మరో 99మంది ప్రాణాలు కోల్పోయారని.. అదే సమయంలో 24,105మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 16,24,495కు చేరుకుంది. ఇప్పటివరకు ఎపిలో కరోనాతో 10,427 మంది బాధితులు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. ఎపిలో ఇప్పటివరకు కరోనా నుంచి 14,21,964మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్య శాఖ పేర్కొంది.
18285New Corona Cases Reported in AP
8285 New Corona Cases Reported in AP
- Advertisement -