Saturday, November 23, 2024

నేరంపై విచారణ.. 6లక్షల పరిహారం

- Advertisement -
- Advertisement -

లైంగిక బాధిత బాలుడికి హైకోర్టు అండ

Compensation for crime in India
న్యూఢిల్లీ: లైంగిక నేరం నేరమే, పరిహారం పరిహారమే అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆరేండ్ల బాలుడిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి ఆరు లక్షల రూపాయల తక్షణ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారంతో చేసిన నేరం పోదు. అయితే లైంగిక దాడికి గురైన బాలుడికి విపరీత చేష్టతో కలిగిన మానసిక భయాందోళన నుంచి భద్రత కల్పించేందుకు ఈ పరిహారం ఉపయోగపడుతుందని, అంతేకాకుండా బాధిత బాలుడు తగు విధంగా న్యాయపరమైన పోరు చేసేందుకు ఈ సాయం ఉపయోగపడుతుందని న్యాయమూర్తి అనూప్ జైరాం భంబానీ తెలిపారు. ఆరేండ్ల బాలుడిపై 2020లో మేనమామ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రయల్ కోర్టు విచారణ జరిపి రూ 50వేల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఇది ఏ మూలకు సరిపోతుందని తెలిపిన హైకోర్టు తన న్యాయం చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News