- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు 43వ వస్తు, సేవల పన్ను (జిఎస్టి) కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్టు ఆర్థికశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రాష్ట్రాలకు పరిహారం, వివిధ మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలపై పన్ను మినహాయింపు వంటి కీలక అంశాలపై జిఎస్టి కౌన్సిల్ చర్చించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. ద్విచక్ర వాహనాల కోసం జీఎస్టీ రేట్లను తగ్గించడం, ఆక్సిజన్ పరోక్ష పన్ను రెట్లు తీసుకురావడం కూడా ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. చమురును జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.
- Advertisement -