- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పరీక్షలపై మళ్లీ జులైలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని ఎపి సర్కార్ తెలిపింది. అప్పుడే, ఇంటర్మీడియట్ పరీక్షలపై కూడా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుపుతామని ప్రభుత్వం ఇన్ని రోజులు చెప్పినప్పటికీ కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో వాయిదా వేసింది. కాగా, ఎపిలో ఇప్పటికే ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. ఆ పరీక్షల తేదీలను కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాక ప్రకటిస్తామని ఎపి ప్రభుత్వం తెలిపింది.
AP 10th class exams postponed
- Advertisement -