Friday, November 22, 2024

జులైలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు!

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం
పరీక్ష సమయం తగ్గింపు
ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జూలై మధ్యలో నిర్వహించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుతం కేంద్రానికి తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి ఎల్.ఎస్.చంగ్సన్‌కు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా లేఖ రాశారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు(గంటన్నర) తగ్గించే యోచన ఉన్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్ష విధానం మార్చలేమని స్పష్టం చేశారు. ప్రశ్నా పత్రంలోని సగం ప్రశ్నలే రాసేందుకు అవకాశమిస్తామని, సగం ప్రశ్నలకే 100 శాతం మార్కులు కేటాయిస్తామని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్య భద్రతకు దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాలలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. అందుకోసం ఉదయం, మధ్యాహ్నం రెండు ప్రశ్నా పత్రాలతో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కొవిడ్ వల్ల రాయలేకపోయిన వారికి మరోసారి పరీక్ష పెడతామని పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో పరీక్షా సమయాన్ని తగ్గించి, ప్రశ్నల ఛాయిస్ పెంచుతామని, పరీక్షా కేంద్రాలలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామని లేఖలో పేర్కొన్నారు.
సిబిఎస్‌ఇ పరీక్షలకు అనుగుణంగా నిర్ణయం..?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) 12వ తరగతి పరీక్షలపై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. జూన్ 1 నాటికి సిబిఎస్‌ఇ తమ నిర్ణయం ప్రకటించనుంది. అయితే సిబిఎస్‌ఇ కూడా జూలైలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ జూలై రెండవ వారంలో పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సిబిఎస్‌ఇ నిర్ణయం వెలువడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరీక్షలపై చర్చించనున్నారు. అనంతరం ప్రభుత్వ అనుమతితో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం జూన్‌లో పరీక్షల నిర్వహణ వైపు మొగ్గు చూపుతుందా..? జూలైలో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తుందా..? అన్న అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది.

TS Inter Exams 2021 to held in July

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News