న్యూఢిల్లీ: దేశంలోని కరోనా మరణాలపై కేంద్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత మరణాల రేటు అబద్ధమని, ప్రభుత్వం నిజం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని తన బాధ్యతల్లో విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు. ప్రధాని ఓ ఈవెంట్ మేజేజర్ అని ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. భారత్ వ్యాక్సిన్ రాజధాని అయినప్పటికీ దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ లేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరణాలు కూడా తప్పుగా నివేదించాయా అనే దానిపై రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 గురించి తాము పదేపదే భారత ప్రభుత్వాన్ని హెచ్చరించామని ఆయన గుర్తుచేశారు.
Spoke to CMs of Congress-ruled States, told them that lying will only harm them, reality needs to be accepted. Actual death numbers might be disturbing but we must stick to telling truth: Rahul Gandhi on whether deaths in Congress-ruled states also wrongly reported pic.twitter.com/eitL4lOPih
— ANI (@ANI) May 28, 2021