వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణం తిప్పాపూర్ లో వంద పడకల ఆస్పత్రిని మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతుందని కెటిఆర్ అన్నారు. మళ్లీ వైరస్ తీవ్రత పెరిగినా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సూచించారు. కరోనా చికిత్సలో వాడుతున్న అన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే రెండుసార్లు చేశామని వివరించారు. బ్లాక్,వైట్ ఫంగస్ కు సంబంధించి ఔషధాలు అందుబాటులోకి తెస్తున్నామని కెటిఆర్ చెప్పారు. కరోనా శాశ్వత పరిష్కారం వ్యాక్సిజేషన్ మాత్రమేనని వివరించారు. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ హైదరాబాద్ లోనే తయారు అవుతుందన్న మంత్రి కెటిఆర్ 85శాతం టీకాల ఉత్పత్తిని కేంద్రం తన అధీనంలోకి తీసుకుందని చెప్పారు. టీకాల విషయంలో రాష్ట్రాల పాత్ర లేకుండా పోయిందన్నారు.
Live: Minister @KTRTRS speaking after inaugurating 100-bed Government Hospital in Vemulawada https://t.co/N4LqgOy9OG
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 28, 2021