Saturday, November 23, 2024

ఎస్ఐ పిలిచాడని.. యువతిపై యువకుడు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

The Maid was sexually assaulted

 

అమరావతి: స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన యువతిని ఓ యువకుడు ఎస్‌ఐ పిలుస్తున్నాడని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అతడు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోంది. మరో యువకుడిని వారిని అనుసరించాడు. యువతికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయని యువకుడు ఆమెను బెదిరించాడు. ఇప్పటివరకు తాను తప్పు చేయలేదని చెప్పడంతో యువకుడు వెంటనే మాటమార్చి స్థానిక ఎస్‌ఐ తీసుకరమ్మన్నాడని ఆమెతో చెప్పాడు. యువతి ఏమీ చేయలేక అతడి బైక్ ఎక్కింది. కొంచెం దూరం ప్రయాణించక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై ఆ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో తనతో పాటు ఉండే స్నేహితులకు ఆ విషయం చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఆమెకు స్నేహితులు ధైర్యం చెప్పి స్థానిక దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News