ముంబయి:రైల్వే స్టేషన్ లో ఓ మహిళా ఖైదీ చూస్తండగానే రన్నింగ్ ట్రైన్ ముందు దూకిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం దాదర్ లో జరిగింది. వెంటనే మహిళను పోలీసులు కాపాడారు. నిందితురాలుగా ఉన్న మహిళను ఒక మహిళా కానిస్టేబుల్, మరో పురుష కానిస్టేబుల్ ఆమెను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. దాదార్ రైల్వే స్టేషన్ చెరుకున్న తరువాత లేడీ కానిస్టేబుల్ సదరు మహిళను బేడీలతో పట్టుకోగా పురుష కానిస్టేబుల్ ముందుకు నడుస్తున్నాడు. అప్పుడు సరిగ్గా లోకల్ రైలు వస్తుండడంతో నిందితురాలు ఒక్కసారిగా పట్టాలపైకి దూకింది. వెంటనే అప్రమత్తమైన పురుష కానిస్టేబుల్ దూకి ఆమెను రక్షించాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సిసి కెమెరాలో నిక్షిప్తమైంది.
#WATCH | Maharashtra: A police personnel saved life of a woman who is accused in a case, when she jumped in front of a train at Dadar Railway station in Mumbai yesterday. pic.twitter.com/rYNMMJkI8G
— ANI (@ANI) May 29, 2021