ఛండీగఢ్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కూడా రాష్ట్రంలో మరో వారం రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ రేపటి(మే 31)తో ముగియనుంది. దీంతో హర్యానాలో జూన్ 7వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆదివారం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. అయితే, తాజా లాక్‌డౌన్‌ను కొన్ని సడలింపులతో అమలు చేయనున్నట్లు తెలిపారు. వాణిజ్య సముదాయాలు సరిబేసి విధానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు నడుస్తాయని..ఇక, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యా సంస్థలు జూన్ 15 వరకు తెరిచేదిలేదని సిఎం మనోహర్ చెప్పారు.
Haryana Govt extends Lockdown till June 7