- Advertisement -
ఉజ్జయిని: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లాలో దారుణం జరిగింది. నీలంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని లవ్ కుష్ నగర్ లో గోవింద్ అనే యువకుడిని కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణరహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైన బాధిత యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. దాడికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో తీయగా మే 28న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Youth Brutally Beaten To Death In Ujjain MP
- Advertisement -