- Advertisement -
అన్నీ చక్కబెడ్తానంటూ ఆడియో సందేశం
చెన్నై: ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటిం చిన ఎఐఎడిఎంకె మాజీ నాయకురాలు వికె శశికళ మన సు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. తమ పార్టీకి చెందిన ఓ నేతతో ఫోన్లో మాట్లాడుతూ ఆమె అన్న మాటలు వైరల్ అయ్యాయి. కరోనా మహమ్మారి పోగానే తాను తి రిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని ఆమె హామీ ఇచ్చిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆందోళన చెందకండి, పార్టీ వ్యవహారాలు తిరిగి చక్కబ డ్తాయి. కరోనా పోగానే నేను రాజకీయాల్లోకి తిరిగి వస్తా’ నంటూ ఆ సంభాషణలో శశికళ భరోసా ఇచ్చారు. దాం తో, స్పందించిన ఆ నేత ‘అమ్మా మేమంతా మీ వెంటే’ అంటూ బదులిచ్చారు. ఈ ఫోన్ కాల్ నిజమైందేనని ఎ ఎంఎంకె ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్ తెలిపారు.
- Advertisement -