- Advertisement -
హూస్టన్: అమెరికాలో నర్స్‌గా ప్రాక్టీస్ చేస్తున్న భారతఅమెరికన్ త్రివిక్రమ్‌రెడ్డి(39)కి ఓ అవినీతి కేసులో అక్కడి స్థానిక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రైవేట్ ఆరోగ్య బీమా పథకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు త్రివిక్రమ్‌రెడ్డిపై అభియోగాలు రాగా, నార్తర్న్ డిస్ట్రిక్ ఆఫ్ టెక్సాస్ కోర్టు విచారణ జరిపింది. 2014 నుంచి 2019 వరకు ఆరోగ్య బీమా పథకాలకు సంబంధించిన క్లెయిమ్‌ల్లో 5.2 కోట్ల డాలర్లమేర అక్రమాలకు పాల్పడినట్టు కోర్టు తేల్చింది. త్రివిక్రమ్‌రెడ్డికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ అటార్నీ తీర్పు ఇచ్చారు. రెడ్డి అమెరికాలో వాగ్జాహాఖే మెడికల్, టెక్సాస్ కేర్ క్లినిక్స్, వి కేర్ హెల్త్ సర్వీసెస్ పేరుతో మూడు క్లినిక్‌లు నిర్వహించేవారు.
- Advertisement -