ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటి నుంచే దరఖాస్తు
ఇంటర్మీడియెట్ ఆన్‌లైన్ తరగతులు వాయిదా
లాక్‌డౌన్ దృష్టా నిలిపివేస్తున్నట్టు బోర్డు ప్రకటన
15 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ఆన్‌లైన్ తరగతులకు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు, కొవిడ్ పరిస్థితులు, లాక్‌డౌన్ దృ ష్టా ఆన్‌లైన్ క్లాసులను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వ చ్చే వరకు ఆన్‌లైన్ తరగతులను నిలిపివేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్లు నిర్వహించాలని ఇంట ర్ బోర్డు నిర్ణయించింది.
విద్యార్థులు ఇంటి నుంచే ప్రభుత్వ కళాశాలల్లో అప్లికేషన్లు స్వీకరించాలని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇందుకోసం సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ ఆన్‌లైన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో మంగళవారం నుంచి సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ ఆన్‌లైన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ ఎస్‌ఎస్‌సి హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే వారి వివరాలు వస్తాయని అన్నారు. విద్యార్థులు జులై 7 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు చేపట్టనున్నారు.
15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు శ్రీదేవసేన జారీ చేశారు. డైట్ కళాశాలలకు కూడా ఈ నెల 15 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణను పరిశీలించాలన్న కెటిఆర్ సూచనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ ఆన్‌లైన్ పద్దతిలో గ్రామీణ విద్యార్థులకు చేరువయ్యే మార్గాలు ఆన్వేషిస్తున్నామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పరిష్కారం లభిస్తుందని మంత్రి సబిత చెప్పారు.
TS Govt extends summer holidays for schools till June 15