Saturday, November 2, 2024

కరోనాపై భారత్ పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం

- Advertisement -
- Advertisement -

మరో 16 భారీ ఆక్సిజన్ ప్లాంట్లు రాక

France to send additional medical supplies to India

న్యూఢిల్లీ :కరోనా మహమ్మారిని నివారించడానికి భారత్ సాగిస్తున్న పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం అందిస్తోంది. ఈమేరకు 16 భారీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లతో పాటు మరికొన్ని వైద్య అవసరాలను అందిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మేక్రాన్ భారత ప్రధాని మోడీతో మాట్లాడిన కొన్ని రోజులకు ఫ్రాన్స్ దౌత్య కార్యాలయం భారత్‌కు సహాయంపై ప్రకటన చేసింది. భారత్ లేకుండా కరోనాపై ప్రపంచం పోరు సాగించలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రశంసించారు. వైద్య అవసరాలతో అనేక నౌకలను భారత్‌కు పంపిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సంస్థ ఎయిర్ లిక్వైడ్ ఉదారంగా అందించిన లిక్విడ్ ఆక్సిజన్‌లో 190 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను భారత నేవీ తీసుకు వచ్చింది. హిందూ మహాసముద్రంలో ఫ్రాన్స్, భారత్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్రిడ్జి ద్వారా ఈ రవాణా జరిగింది. అనేక వందల ఆకిజన్ కాన్‌సెంట్రేటర్లు , హైగ్రేడ్ వెంటిలేటర్లు, త్వరలో భారత్‌కు ఫ్రాన్స్ నుంచి వస్తాయి. భారత్ లో పనిచేస్తున్న 50 ఫ్రెంచి కంపెనీలు, ఇండోఫ్రెంచి చాంబర్ ఆఫ్ కామర్స్, ఎన్‌జివొలు, ప్రైవేట్ కంపెనీలు మొత్తం 55 కోట్ల రూపాయల మేరకు సహాయంలో పాలుపంచుకున్నాయి. మే 2న అప్పటికప్పుడు వాడి పారేసే వైద్య పరికరాలు 28 టన్నుల వరకు ఫ్రాన్స్ నుంచి వచ్చాయి. ఇప్పటివరకు 40 దేశాలు భారత్‌కు సహాయం అందిస్తున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News