విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే మాకు ముఖ్యం
రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ
పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు తెర
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సిబిఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఉన్నతాధికారులు, మంత్రివర్గ సహచరులతో ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి విలయ తాండవంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత తమకు చాలా ముఖ్యమని, ఈ అంశంలో ఎటువంటి రాజీ ఉండబోదని, ప్రధా ని మోదీ స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొని ఉందని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులు పరీక్షలకు బలవంతంగా హాజరు కావలసిన పనిలేదన్నారు. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో కేంద్ర మంత్రులు, అమిత్‌షా, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలాసీతారామన్,సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఈ) చైర్మన్ మనోజ్ ఆహూజాలతోపాటు పాఠశాల ఉన్నత విద్య సెక్రటరీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు, ఇతర పక్షాలతో చర్చించిన మీదట ప్రభుత్వం ముందున్న అన్ని అంశాల పైనా ప్రధాని సమీక్షించారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా గత ఏడాది మాదిరి గానే పరీక్షలు రాయాలని కొందరు విద్యార్థులు కోరుకుంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ అవకాశం ఇవ్వాలని సిబిఎస్‌ఈ యోచిస్తోంది. సిబిఎస్‌ఈ పదోతరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఫలితాల వెల్లడి విషయంలో ఆబ్జెక్టివ్ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. నిర్ణీత సమయంలో ఫలితాలు ప్రకటించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పెద్ద ఉపశమనం : కేజ్రీవాల్ ట్వీట్
సిబిఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేయడంపై ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ హర్షం ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం గమనించి అందరం చాలా ఆందోళన చెందామని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం ఇచ్చిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Government of India has decided to cancel the Class XII CBSE Board Exams. After extensive consultations, we have taken a decision that is student-friendly, one that safeguards the health as well as future of our youth. https://t.co/vzl6ahY1O2
— Narendra Modi (@narendramodi) June 1, 2021
I am glad 12th exams have been cancelled. All of us were very worried abt the health of our children. A big relief
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 1, 2021