- Advertisement -
పారిస్: జపాన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి నవోమి ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది. ఒసాకా తీసుకున్న నిర్ణయం ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంతకాలంగా మానసిక ఆందోళనకు గురవుతున్నానని, ఇలాంటి స్థితిలో ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగడం తనకు సాధ్యం కాదని ఒసాకా ట్వీట్ చేసింది. ఇదిలావుండగా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒసాకా రెండో సీడ్‌గా బరిలోకి దిగింది. తొలి రౌండ్లో విజయం సాధించింది. అయితే తొలి రౌండ్ గెలుపు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి ఒసాకా హాజరు కాలేదు. దీంతో రిఫరీ ఒసాకాకు భారీ జరిమానా విధించారు. దీంతో మనో వేదనకు గురైన ఒసాకా టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
- Advertisement -