ఐజ్వాల్: భార్యకు కరోనా సోకడంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించడానికి భర్త వినూత్నంగా ఆలోచించి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్తను నెటిజన్లు కామెంట్లతో ప్రశంసిస్తున్నారు. మిజోరాంలో భార్యకు కరోనా సోకడంతో ఆమెను ఐసోలేషన్ సెంటర్ కు తరలించాలి. ఓ జీపుకు వెనక భాగంలో ట్రాలీని అమర్చాడు. ట్రాలీలో ఆమెను కూర్చోబెట్టి ఆమెను హాయిగా ఐసోలేషన్ సెంటర్ కు తరలించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఐపిఎస్ అధికారి రిపున్ శర్మ పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీ తెలివికి హ్యాట్సాఫ్ అని, భార్య అదృష్టవంతురాలు అని కామెంట్లతో ప్రశంసిస్తున్నారు. గత 24 గంటల్లో మిజోరాంలో 312 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 41 మంది మృతి చెందారు. 3144 యాక్టివ్ కేసులుండగా 9214 కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.9 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. 3.2 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
https://www.youtube.com/watch?v=sfzgChhr-Z0